NTV Telugu Site icon

Kichcha Sudeep: 50 ఏళ్ల వయస్సులో ఆ బాడీ ఏంటీ సామీ..

Sudheep

Sudheep

Kichcha Sudeep: కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారాడు. ఈ సినిమా తర్వాత సుదీప్.. కన్నడ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. సైరా నరసింహారెడ్డి, విక్రాంత్ రోణ వంటి సినిమాలతో తెలుగు అభిమానులు కూడా సంపాదించుకున్నాడు సుదీప్. ఇక ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. కర్ణాటకలో ఒక పార్టీకి ఆయన ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుదీప్ K46 అనే సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వీ క్రియేషన్స్ బ్యానర్ తో పాటు కిచ్చా క్రియేషన్స్ బ్యానర్ పై కిచ్చా సుదీప్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Samantha: అర్ధరాత్రి అతడితో వీడియో కాల్.. అడ్డంగా దొరికిపోయిన సామ్

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం కోసం సుదీప్ చాలా కష్టపడినట్లు కనిపిస్తుంది. తాజాగా సుదీప్ సిక్స్ ప్యాక్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ షార్ట్ కోసం సుదీప్ సిక్స్ ప్యాక్ చూపించాల్సి ఉండగా.. దానికోసం ఆయన ఎంతో కష్టపడి బాడీని రెడీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వయస్సు 50. ఈ ఏజ్ లో కూడా ఆ బాడీని అలా రెడీ చేయడంపై అభిమానులు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఆ బాడీ ఏంటి సామీ అని కొందరు కుర్ర హీరోల సైతం కథను బట్టి పాత్రలు మారుస్తుంటే ఈ వయస్సులో కూడా ఇలా కనిపించిన నీ డెడికేషన్ కి టేక్ ఏ బౌ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా సుదీప్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.