కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, ప్రస్తుతం ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ‘కిచ్చా 46’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ‘కిచ్చా 46’ సినిమాని పాన్ ఇండియా రేంజులో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యకుండా దాదాపు మూడు నిమిషాల టీజర్ ని రిలీజ్ చేసిన మేకర్స్, ఇంస్టాన్ట్ బజ్ జనరేట్ చేసారు.
Read Also: Disha Patani: రెడ్ శారీలో దిశ అందాల విందు
కిచ్చా సుదీప్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ లా కట్ చేసిన ఈ వీడియోలో సుదీప్ లుక్ అదిరిపోయింది. రన్నింగ్ లో ఉన్న వాన్ లో, బులెట్ గాయాలతో కూడా మనుషులని చంపుతూ కిచ్చా సుదీప్ మాస్ వైబ్స్ ఇస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ ని ఎలివేట్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉన్న ఈ టీజర్, కిచ్చా 46 సినిమాపై హైప్ ని అమాంతం పెంచింది. మరి ఈ యాక్షన్ సినిమాకి ఎలాంటి టైటిల్ ని ఫిక్స్ చేసారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవరెవరు నటిస్తున్నారు లాంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Witness the explosive action promo🌋 as the Baadshah @KicchaSudeep's Demon War Begins #Kichcha46Teaser😈
▶️Check out https://t.co/WwNNxkfrlu#Kichcha46 @Kichchacreatiin @saregamasouth @TSrirammt @shivakumarart @vijaykartikeyaa @shekarchandra71 @AJANEESHB @ganeshbaabu21… pic.twitter.com/AnJwunW7t4
— Kalaippuli S Thanu (@theVcreations) July 2, 2023