కన్నడ చిత్రసీమలో ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విజయంలో కథానాయిక దీప్శిఖ చంద్రన్ పోషించిన పాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ ‘మార్క్’ చిత్రంలో దీప్శిఖ తన నటనతో ఆ సంప్రదాయాన్ని చెరిపివేశారు. సినిమా మొదలైనప్పటి నుండి ముగిసే వరకు తనదైన శైలిలో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆమె తెరపై కనిపించిన ప్రతిసారీ థియేటర్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతున్నాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, సినిమాలో ఆమె చేసిన యాక్షన్ బ్లాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. రియలిస్టిక్ యాక్షన్ సీన్స్‌లో ఆమె చూపిన తెగువకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. భావోద్వేగాలను పండించడంలోనూ, పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడంలోనూ దీప్శిఖ ఎంతో పరిణతి కనబరిచారని అంటున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఆమెను “మార్క్ క్వీన్” అలానే “క్వీన్ ఆఫ్ మార్క్” అని సంబోధిస్తున్నారు. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ రావడంలో ఆమె పోషించిన బలమైన పాత్ర ఒక ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కన్నడ మార్కెట్‌లో ‘మార్క్’ చిత్రం సాధిస్తున్న ఘనవిజయానికి ప్రేక్షకులలో ఉన్న ‘మౌత్ టాక్’ ఎంతో తోడ్పడింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సైతం దీప్శిఖ పోషించిన ధీరవనిత పాత్రకు ఫిదా అవుతున్నారు. దీప్శిఖ చంద్రన్ కెరీర్‌లో ‘మార్క్’ సినిమా ఒక గొప్ప మలుపుగా నిలిచిపోనుంది. ఈ చిత్రంతో ఆమెకు లభించిన గుర్తింపు, ఆదరణ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ సినిమాల్లో ఆమె ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమనిపిస్తోంది.
