Site icon NTV Telugu

Kiccha Sudeep: కన్నడ నిర్మాత ఆరోగ్యంపై స్టార్ హీరో వివరణ!

Kichha Sudeep

Kichha Sudeep

ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత, పంపిణీదారుడు జాక్ మంజునాథ్ ఆరోగ్యానికి సంబంధించిన కర్ణాటకలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణా’కు జాక్ మంజునాథ్ నిర్మాత. దాంతో సుదీప్ తన నిర్మాత ఆరోగ్యానికి సంబంధించి వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జాక్ మంజునాథ్ హాస్పిటల్ లో చేరారని, అయితే అక్కడి సిబ్బంది ఆయన నిద్రపోతున్న ఫోటోలను లీక్ చేయడంతో అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రస్తుతం మంజునాథ్ ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఈ రోజు ఆయన హాస్పిటల్ నుండి డిస్ ఛార్జ్ కాబోతున్నారని సుదీప్ ఆ ట్వీట్ ద్వారా తెలిపారు. మంజునాధ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు జరిపిన వారికి సుదీప్ కృతజ్ఞతలు చెప్పారు.

Exit mobile version