Site icon NTV Telugu

Kiara Advani: పెళ్లి తరువాత కియారా న్యూడ్ ఫోటో.. బయటపడింది ఇలా

Kiyara

Kiyara

Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి కూడా కియారా సుపరిచితమే. భరత్ అనే నేను సినిమాతో పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ వసుమతి.. రెండో సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయవిధేయ రామలో మెరిసింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితం అనిందించనప్పటికీ.. మరోసారి ఈ హీరోయిన్ నే ఏరికోరి ఎంచుకొని గేమ్ ఛేంజర్ లో అవకాశమిచ్చారు చరణ్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Chalaki Chanti: చలాకీ చంటికి గుండెపోటు.. పరిస్థితి విషమం

సినిమాలు, వ్యక్తిగత జీవితాలు పక్కన పెడితే.. కియారా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కించే ఫోజులతో అదరగొడుతుంది. అయితే కియారా ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసిన విషయం తెల్సిందే. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డాబు రత్నానీ తీసిన ఆ ఫోటో నెట్టింట ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకు అడ్డుగా పెట్టుకొని కియారా నగ్నంగా నిలబడినట్లు కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో ఎప్పుడో తీసినా.. మరోసారి ఈ ఫోటోను షేర్ చేసి డాబు రత్నానీ హాట్ టాపిక్ గా మార్చాడు. ” మిమ్మల్ని మీరు నమ్ముకోండి” అనే క్యాప్షన్ ఇస్తూ.. కియారాను ట్యాగ్ చేశాడు. ఇక ఈ ఫోటోను చూసిన వారందరు.. ఇప్పుడెందుకు అండీ ఇలాంటివన్నీ తోడతారు.. ఆమెకు పెళ్లి అయ్యింది.. ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే.. ఆమె ఫీల్ అవుతోంది కదా అంటూ కియారా అభిమానులు నొచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version