Site icon NTV Telugu

కియారా కిక్.. నెట్టింట్లో వైరల్

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువ‌గా జిమ్‌లో గ‌డిపే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైనర్ తలపై ఉన్న టోపీని కాలితో తన్ని పడేసింది. దీంతో అభిమానులు ఆమె ఫిట్నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏడాది క్రితం తీసిందని.. అతడి నమ్మకానికి నా హ్యాట్సాఫ్ అంటూ కియరా రాసుకొచ్చింది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ఉన్న ఈ బ్యూటీ తెలుగులో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో ‘విన‌య విధేయ రామ‌’లో న‌టించింది. రీసెంట్ సోషల్ మీడియాలో ముచ్చటించిన కియారా త్వరలోనే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలిపింది.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

Exit mobile version