NTV Telugu Site icon

Khushi: సమంతతో కలిసి కొండన్న సెప్టెంబర్ లో వసున్నాడట..

Vijay

Vijay

Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

Nani Raviteja: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్…

సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దాంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. పోస్టర్ లో విజయ్ మెడలో సాఫ్ట్ వవేర్ ట్యాగ్ వేసుకొని కనిపిస్తుండగా.. మేడ మీద ఉన్న సమంత అతడి చెయ్యి అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1 న కలుసుకోనున్నాయి అని మేకర్స్ చెప్పుకొచ్చారు. రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. వారి జీవితంలో ఖుషీ ఎలా వచ్చింది అనేది ఎంతో హృద్యంగా తెరకెక్కిస్తున్నాడట శివ నిర్వాణ. కశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఖుషీ .. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి .

Show comments