NTV Telugu Site icon

Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా

Khushboo

Khushboo

Khushboo Sunder: ప్రస్తుతం సమాజంలో ఒక మహిళ.. నిజాన్ని నిజాయితీగా చెప్పినా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారే కానీ సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉన్నారు. అది హీరోయిన్లు అయితే మరింత ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా ఒక ఆడది అబద్దాలు చెప్తుందేమో కానీ లైంగిక వేధింపులకు గురయ్యాను అని మాత్రం పొరపాటున కూడా చెప్పదు. ఇక ఇండస్ట్రీలో ఆ విషయం చెప్తే ఎక్కడ తమ కెరీర్ ను నాశనం చేస్తరేమో అన్న భయంతో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. ఇక ఈ మధ్యనే వారు ఆ భయాన్ని వదిలిపెట్టారు. తమను లైంగికంగా వేధించనవారి పేరులు మీడియా ముందుకు చెప్పుకొస్తున్నారు.

RC15: రామ్ చరణ్- శంకర్ టైటిల్ భలే గమ్మత్తుగా ఉందే..?

రెండు రోజుల క్రితం సీనియర్ నటి ఖుష్బూ తాను చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యినట్లు చెప్పుకొచ్చింది. తన కన్న తండ్రే తనను లైంగికంగా వేధించినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు సపోర్ట్ చేయాల్సింది పోయి.. ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గులేదా..? కన్నతండ్రి ఇలా చేశాడు అని చెప్పి పరువు తీస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై ఖుష్బూ స్పందించింది. ” నా తండ్రి నీచుడు. అతడి గురించి చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సింది నేను కాదు అలా నాతో ప్రవర్తించిన వ్యక్తి.. ఈ విషయం చెప్పడం వలన నాలా బాధపడిన వారు ఇప్పుడు బయటికి వచ్చి వారికి జరిగిన చేదు అనుభవాలను ఎంతో ధైర్యంగా చెప్పుకొస్తున్నారు” అని తెలిపింది. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments