Khudiram Bose: సినిమా రిలీజ్ చేయలేక ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khudiram Bose Producer Hospitalised: సినిమా అనేది ఫక్తు వ్యాపారం, ప్యాషన్ కొద్దీ సినీ పరిశ్రమకి వచ్చామని చెబుతున్నా చివరికి వ్యాపారం ఒక్కటే నిలబెట్టేది. అయితే ఇప్పుడు ఒక అవార్డు సినిమా తీసి సినీ నిర్మాత ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా మూవీగా ‘ఖుదీరామ్ బోస్’ సినిమాను గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది.
Yarlagadda Venkata Rao: వైసీపీకి గుడ్‌బై.. గన్నవరం నుంచి గెలిచి జగన్‌ని అసెంబ్లీలో కలుస్తా..!
Also Read
- Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
- Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
- Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
- Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రపంచ రికార్డు..
2022 డిసెంబర్ 22న ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని మన దేశ వ్యాపిత పార్లమెంట్ సభ్యులకు కూడా ప్రదర్శించారు. అలా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారని అంటున్నారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారని తెలుస్తోంది. ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం మరియు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితికి రావడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!