NTV Telugu Site icon

Khudiram Bose: సినిమా రిలీజ్ చేయలేక ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత

Khudirambose

Khudirambose

Khudiram Bose Producer Hospitalised: సినిమా అనేది ఫక్తు వ్యాపారం, ప్యాషన్ కొద్దీ సినీ పరిశ్రమకి వచ్చామని చెబుతున్నా చివరికి వ్యాపారం ఒక్కటే నిలబెట్టేది. అయితే ఇప్పుడు ఒక అవార్డు సినిమా తీసి సినీ నిర్మాత ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా మూవీగా ‘ఖుదీరామ్ బోస్’ సినిమాను గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజ‌య్ జాగర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌గా చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Yarlagadda Venkata Rao: వైసీపీకి గుడ్‌బై.. గన్నవరం నుంచి గెలిచి జగన్‌ని అసెంబ్లీలో కలుస్తా..!

2022 డిసెంబ‌ర్ 22న ‘ఖుదీరామ్ బోస్‌’ చిత్రాన్ని మన దేశ వ్యాపిత పార్లమెంట్‌ సభ్యులకు కూడా ప్రదర్శించారు. అలా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారని అంటున్నారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె.వెంక‌టేష్ వ‌ర్క్ చేశారని తెలుస్తోంది. ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం మరియు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితికి రావడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.

Show comments