NTV Telugu Site icon

Salaar: ఒక్క వీడియోలో సలార్ కథ మొత్తం చెప్పేశారు కదరా..

Khansar

Khansar

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయాన్ని సలార్ అందించింది. దేవరథ రైజర్ గా ప్రభాస్, వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. ఇక సలార్ లో మూడు తెగలను చూపించారు. ఖాన్సార్ ను మూడు తెగలు పరిపాలించాలి. ప్రతి 40 ఏళ్లకు ఒక తెగ నుంచి మరో తెగకు ఆ రాజ్య పాలన అధికారం మారుతూ ఉంటుంద. దాన్ని అలాగే పాటించాలని ఒక నిబంధనను కూడా రాసి పెట్టడం జరిగింది. ఇదంతా సినిమా చూసిన చాలామందికి అర్ధం కాలేదు. అందుకే.. ఆ తెగలు ఏంటి.. ? వారి పిల్లలు ఎవరు.. ? ఎవరెవరు రాజ్యపాలన చేశారు.. ? ఎవరు.. ఎవరిని మట్టుబెట్టారు.. ? అనేది పూర్తి అనాలసిస్ ను ఒక వీడియోలో పొందుపర్చి హోంబలే తన అధికారిక యూట్యూబ్ లో షేర్ చేసింది.

ఖాన్సార్ లో మూడు తెగలు ఉన్నాయి. మన్నార్, శౌర్యంగ, ఘానియార్. ఈ మూడు తెగలు కలిసి ఖాన్సార్ ను ఎవరు పరిపాలించాలి అనేది ఒక బుక్ గా రాశారు. దాని పేరే నిబంధన. ఈ బుక్ లో ప్రతి 40 ఏళ్లకు.. ఒక తెగ మారుతూ ఉంటుంది. 40 ఏళ్లు మన్నార్ తెగ పరిపాలిస్తే.. ఆ తరువాత ఆ అధికారాన్ని శౌర్యంగా తెగకు ఇవ్వాలి. వారు ఇంకో 40 ఏళ్లు అధికారంలో ఉంటారు. అనంతరం ఘనియార్ ఆ అధికారాన్ని అందుకుంటుంది. ఇక మొదట మన్నార్ పెద్ద శివ మన్నార్.. 40 ఏళ్ళు పరిపాలించి.. మృతి చెందుతాడు. ఇక నిబంధన ప్రకారం..శివ మన్నార్ చనిపోయాక.. ఖాన్సార్ అధికారం శౌర్యంగ వారికి రావాలి. కానీ, శివ మన్నార్ కొడుకు రాజమన్నార్.. శౌర్యంగ తెగకు చెందిన దొర ధారతో పాటు.. శౌర్యంగ తెగను మొత్తం చంపేస్తాడు. ఆ తరువాత మన్నార్, ఘనియార్ కలిసి తరువాత 30 ఏళ్లు ఖాన్సార్ ను రూల్ చేస్తారు. ఇక రాజమన్నార్ కు ఇద్దరు భార్యలు.. మొదటి భార్య కొడుకు రుద్ర రాజమన్నార్, కూతురు రాధారమ. రెండో భార్య కొడుకులు వరద రాజమన్నార్, బాచీ రాజమన్నార్. మొత్తం ఖాన్సార్ లో 8 దొరలు .. 61 మంది కాపరులు ఉన్నారు. ఈ 8 మంది దొరల్లో .. ముగ్గురు మన్నార్ వంశానికి చెందినవారు.. ఓం, రుద్ర రాజమన్నార్, రాధారమ భర్త భారవ.. ఇక మిగిలిన 5గురు ఘనియార్ తెగకు చెందినవారు. వారి పేర్లు.. నారంగ్, వాలి, రంగ, చీకా, గురు. వీరందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు.

ఇక ఎప్పుడైతే రాజమన్నార్.. తన స్థానాన్ని తన రెండో భార్య కొడుకు అయిన వరద రాజమన్నార్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడో అప్పుడు యుద్ధం మొదలయ్యింది. వరదను కింగ్ గా చేయడం ఇష్టం లేని రుద్ర, భారవ, రంగ.. ఎలాగైనా వరదను చంపాలని అనుకుంటారు. ఆ సమయంలోనే ఖాన్సార్ లో యుద్దాన్ని సహించలేని రాధారమ.. ఖాన్సార్ లో యుద్ధం చేయకూడదని ప్రకటిస్తుంది. అదే సీజ్ ఫైర్. ఖాన్సార్ లో ఎవరు ఎవరి మీద అటాక్ చేయకూడదు అని చెప్తుంది. దీంతో రుద్ర మిగతవారిని పిలిచి రాధారమ నిర్ణయం పాటించాలా..? పాటించకూడదా.. ? అని ఓట్లు వేయమని చెప్తాడు. దానికోసం 9 రోజులు గడువు ఇస్తారు. ఆ 9 రోజుల్లో ఏం జరిగింది.. ? 9 వ రోజు రాత్రి జరిగిన మారణకాండకు భాద్యులు ఎవరు.. ? వరద అధికారాన్ని చేజిక్కించుకున్నాడా.. ? అనేది సలార్ కథ. ఈ చరిత్రను అంతా ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. స్నేహితుడుకు అధికారం అందివ్వడానికి వచ్చిన దేవా.. చివరకు ఆ స్నేహితుడుకే ఎందుకు శత్రువుగా మారాడు అనేది శౌర్యంగ పర్వంలో చూడాల్సిందే.

Show comments