టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన చిత్రం ఖలేజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖలేజా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ క్లాసిక్. వెండితెరఅపి సక్సెస్ కానీ ఖలేజా బుల్లి తెరపై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఖలేజా టీవీలో వస్తుందంటే చూసే ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు.
కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది. ఇటీవల టాలీవుడ్ లో రిలీరిజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీరిజ్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. మరి ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఖలేజా 4K లో రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. అదే డేట్ కు రావాల్సిన విజయ్ దేవరకొండ కింగ్డమ్, హరిహర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో ఖలేజాకు భారీ రిలీజ్ దొరికింది. పోటీ లో మరే ఇతర సినిమాలు లేకవపోవడం ఖలేజా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండడం వంటి రీజన్స్ కారణంగా రీరిలీజ్ లో ఈ సినిమా బిగ్గెస్ నుంబర్స్ తెచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ జయంతి కూడా ఖలేజాకు కలిసొచ్చే అంశం. ఫ్యాన్స్ కూడా ఖలేజా రీరిలీజ్ అవుతుండడంతో సంతోష వ్యక్తం చేస్తు సోషల్ మీడియాలో కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు.
