Site icon NTV Telugu

KGF 3 : ఆ ట్విస్ట్ తో ఎండ్ కార్డు !?

Kgf 3

Kgf 3

KGF 3 ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ట్రెండింగ్ లో ఉన్న హాట్ న్యూస్. దర్శకుడు ప్రశాంత్ నీల్ “KGF 2” ఎండింగ్ లో సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి “KGF 2″తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా, KGF 3 అనౌన్స్మెంట్ తో అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తించారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు KGF 3 గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. KGF 3కి ఒక ట్విస్ట్ తో ఎండ్ కార్డు పడనుందట. కేవలం సినిమాకే కాదు సీక్వెల్ కు కూడా !

Read Also : Bloody Mary Movie Review : సారీ…మేరీ!

ప్రశాంత్ నీల్ KGF 3ని USAతో పాటు ఇతర రెండు దేశాలలో చిత్రీకరించనున్నారని, 70ల కాలాన్ని దర్శకుడు ఆయా దేశాలలో రీక్రియేట్ చేయాలనుకుంటున్నాడని, కాబట్టి ఈ సీక్వెల్ నిర్మాణానికి చాలా సమయం పడుతుందని టాక్. KGF 3 మూవీలో విదేశాలలో రాకీ చేసిన నేరాలు, వాటి నేపథ్య కథలతో తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ఇక KGF 2 కి హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ రావడంతో ప్రశాంత్ తన ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ పార్ట్ ను రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేతిలో “సలార్”, ఆ తరువాత ఎన్టీఆర్ తో ఓ మూవీ ఉన్నాయి.

Exit mobile version