NTV Telugu Site icon

KGF 3 : డిసెంబర్ నుంచి ‘కెజిఎఫ్‌3’

Kgf 22

Kgf 22

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్2’ బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్3 గురించి హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడట. ‘కెజిఎఫ్‌3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ కల్లా ఇది పూర్తవుతుందని, ఆ తర్వాత ‘కెజిఎఫ్3’పై దృష్టిసారిస్తారట. అంతే కాదు ప్రశాంత్ ఇటీవల ఎన్టీఆర్ 31 కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోటోషూట్ కూడా చేసాడు. ఈ సినిమాకు సంబంధించ అధికారిక ప్రకటన ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ ‘కేజీఎఫ్ 3’ ని ఆరంభిస్తే ఎన్టీఆర్ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.