‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనం సృష్టించాయె తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కన్నడ చిత్రసీమను రూపురేఖలు మార్చి, రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించింది. అయితే పార్ట్ 2 క్లైమాక్స్‌లో చాప్టర్ 3 ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో, ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా..
Also Read : Dude : ఆర్య సినిమానే నా ప్రేరణ – డ్యూడ్ దర్శకుడు కీర్తిశ్వరన్
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 3కి ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కొన్ని వర్గాలు ఇన్‌స్టాలో పోస్టు నిజంగానే ఆయన ఖాతా ద్వారా వచ్చిందా, లేదా పేరడీ అకౌంట్ ద్వారా వైరల్ చేయబడిందా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు, అందువల్ల కొన్ని వార్తలు ఫేక్ కూడా కావచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని అనంతరం ప్రభాస్‌తో ‘సలార్ 2’ పూర్తి చేసిన తరువాతే కేజీఎఫ్ చాప్టర్ 3 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
