కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “KGF Chapter 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. KGF Chapter 2 మూవీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు, యష్ ఫాలోవర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఆసక్తి ఎంతన్న సంఖ్యను పాపులర్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో చెప్పేస్తోంది. ఈ యాప్ కేవలం సినిమా టిక్కెట్లను బుక్ చేయడమే కాకుండా ఒక్కో సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాన్ని కూడా లెక్కబెట్టి మరీ చూపిస్తోంది. ఈ క్రమంలోనే KGF Chapter 2 ఫస్ట్ కన్నడ మూవీగా రేర్ ఫీట్ సాధించింది. బుక్ మై షోలో ఈ మూవీ 1M+ వ్యూస్ సాధించింది. దీన్ని బట్టి ఈ మూవీ గురించి ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్
ఇక ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన KGF Chapter 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ KGFకి సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. KGF Chapter 2లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు మేకర్స్.
