KGF Chapter 2 గురించి తాజా అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే KGF 2 సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ఆసక్తికర రన్‌టైమ్‌ను కూడా లాక్ చేసుకుంది.
Read Also : Pranitha : డాక్టర్ ఆత్మహత్యపై హీరోయిన్ ఎమోషనల్
సెన్సార్ బోర్డ్ సమాచారం ఆధారంగా KGF Chapter 2 సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. ఇక 2 గంటల 48 నిమిషాల 06 సెకన్లు లాక్ చేశారు. అంటే సినిమా దాదాపు 3 గంటల పాటు సాగుతుందన్న మాట. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు, యష్ ఫాలోవర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన KGF Chapter 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ KGFకి సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. KGF Chapter 2లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. KGF Chapter 2 మూవీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లపై మేకర్స్ ఇప్పుడు దృష్టి పెట్టారు.
