NTV Telugu Site icon

KGF: బ్రేకింగ్.. కెజిఎఫ్ తాత ఇక లేడు

Kgf

Kgf

KGF: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కెజిఎఫ్ చిత్రంలో నటించి మెప్పించిన నటుడు కృష్ణ. జి. రావు మృతి చెందాడు. గత కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ జి. రావు కెజిఎఫ్ కు ముందు పలు సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. కెజిఎఫ్ సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఆయన నటించాడు. కెజిఎఫ్ ఇంటర్వల్ లో రాఖీ భాయ్ మనసు మారడానికి కారణం ఈ తాతనే.

అంధుడు అయిన తాతను విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తుండగా అతడిని కాపాడడానికి రాఖీ భాయ్ రంగంలోకి దిగి వారిని చితక్కొట్టి తాతను కాపాడతాడు. ఇక కెజిఎఫ్ 2 లోనూ రాఖీ భాయ్ కు ఎలివేషన్స్ ఇచ్చేది ఈ తాతనే. ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఎక్కడ చూసినా కెజిఎఫ్ తాత అని గుర్తుపడుతున్నారని అప్పట్లో చెప్పుకొచ్చాడు. కృష్ణ. జి.రావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.