Site icon NTV Telugu

KGF Actor : కేజీఎఫ్‌-2 నటుడికి క్యాన్సర్.. సాయం కోసం ఎదురుచూపు

Kgf Actor

Kgf Actor

KGF Actor : యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్‌-2 ఏ స్థాయి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా ఇప్పటికీ ఓ సెన్సేషన్. కాగా ఈ మూవీలో నటించిన చాలా మంది అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. రీసెంట్ గానే ఇందులో ముంబై డాన్ పాత్రలో కనిపించిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు మరో నటుడు క్యాన్సర్ కు గురయ్యాడు. అతను ఎవరో కాదు.. ఈ సినిమాలో హీరో వెన్నంటే ఉండే చాచా పాత్రలో కనిపించిన హరీష్‌ రాయ్. ఇతను కేజీఎఫ్‌ సినిమాలో చాచా పాత్రలో కనిపిస్తూ హీరోకు ఎలివేషన్లు ఇస్తుంటాడు. ఇతను ఇచ్చే ఎలివేషన్లు సినిమాకే హైలెట్ అనే చెప్పుకోవాలి. సినిమాలో ఆయనది చాలా బలమైన పాత్ర. అలాంటి హరీష్‌ రాయ్ ఈ మూవీతో పాటు చాలా మూవీల్లో కనిపించాడు. కానీ అనుకోకుండా ఆయన క్యాన్సర్ కు గురయ్యాడు.

Read Also : Mirai : మిరాయ్ లో మహేశ్ బాబు.. తేజ సజ్జా షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఈ రోగంతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవాలంటే ఒక్క ఇంజెక్షన్ కోసం రూ.3.5 లక్షలు అవుతుందని తెలిపాడు. ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు తీసుకోవాలి. అంటే ఒక్క సైకిల్‌కు రూ.10.5 లక్షలు అవుతుంది. 17 నుండి 20 ఇంజక్షన్లు తీసుకోవాలని.. మొత్తం రూ.70లక్షలు దాకా కావాలన్నాడు. అంతటి ఆర్థిక స్థోమత తనకు లేదని.. సాయం చేయాలని కోరుకుంటున్నాడు హరీష్‌ రాయ్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కేజీఎఫ్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : Kerala: ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..

Exit mobile version