NTV Telugu Site icon

BS Avinash: కారు ప్రమాదానికి గురైన ‘కెజిఎఫ్’ విలన్..

Avinash

Avinash

‘కెజిఎఫ్’ సినిమాలో.. ‘బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు’ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెప్పి మెప్పించిన నటుడు బీఎస్ అవినాష్. కెజిఎఫ్ 2 లో కూడా అవినాష్ కీలక పాత్ర పోషించాడు. ఒక్క సినిమాతో అవినాష్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. “నిన్న ఉదయం 6.05 నిమిషాలకు నా కారు ప్రమాదానికి గురయ్యింది. దేవుడి దయ వలన ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాను. ఒక ఈవెంట్ కు వెళ్లాల్సి ఉండగా.. లేట్ అయిపోయిందన్న తొందరలో జిమ్ నుంచి ఖాళీగా ఉన్న రోడ్డుపై స్పీడు గా వెళ్తున్నాను.

అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడితే ఆపాను.. అయితే సిగ్నల్ ను పట్టించుకోకుండా ఒక కంటైనర్ స్పీడుగా వచ్చి నా కారును ఢీకొట్టింది. నా కారు ముందు భాగం మొత్తం ధ్వంసం అయ్యింది. అయితే దేవుడి దయ వలన నాకు ఎటువంటి గాయాలు కాలేదు. కంటైనర్ నడిపిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానులు, నా కుటుంబ బ్లెస్సింగ్స్ వలనే నేను ప్రాణాలతో బయటపడ్డాను. ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments