KGF 2: ‘ట్రిపుల్ ఆర్’ను అందుకోలేని ‘కేజీఎఫ్-2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ కు ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు మరింత ఊపు తెచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ యేడాది ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినిమా రంగం ప్రతిభను దశదిశలా చాటాయని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఉత్తరాదిన ఈ సినిమాలు హిందీ చిత్రాలను కూడా పక్కకు నెట్టి అగ్రపథంలో పయనించడం విశేషం! నార్త్ ఇండియాలో హిందీ ‘ట్రిపుల్ ఆర్’ కంటే ‘కేజీఎఫ్- 2’ హిందీ వెర్షన్ ఎక్కువ మొత్తం చూసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అయితే అమెరికాలో మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ను అధిగమించడం అటుంచి, అసలు అందుకోవడానికే ‘కేజీఎఫ్-2’కు సాధ్యం కాదని తెలుస్తోంది.
అమెరికాలో సందడి చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ లో ఇప్పటికీ ‘బాహుబలి-2’ అగ్రస్థానంలో నిలచింది. అక్కడ ఈ చిత్రం 20.5 మిలియన్ల డాలర్లు పోగేసి నంబర్ వన్ స్థానం ఆక్రమించింది. దాని తరువాతి స్థానాన్ని ‘ట్రిపుల్ ఆర్’ 14 మిలియన్ డాలర్లు పోగేసి సొంతం చేసుకుంది. మూడో స్థానంలో ‘బాహుబలి-1’ నిలచింది. ఆ సినిమా మొత్తం 8 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ‘కేజీఎఫ్-2’ ఇప్పటి దాకా 6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అటు హిందీ, ఇటు తెలుగులో భారీ చిత్రాలు వస్తోన్న నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ మహా అయితే మరో 2 మిలియన్ డాలర్లు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా! కావున, అమెరికాలో ‘ట్రిపుల్ ఆర్’ ముందు ‘కేజీఎఫ్-2’ వెనుకబడిందనే చెప్పాలి.
Also Read
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- Tags
- KGF 2
- latest news
- rajamouli
- rrr
- Yash
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!