Site icon NTV Telugu

KGF 2: ‘ట్రిపుల్ ఆర్’ను అందుకోలేని ‘కేజీఎఫ్-2’

Kgf Rrr

Kgf Rrr

మన దేశంలో పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ కు ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు మరింత ఊపు తెచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ యేడాది ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినిమా రంగం ప్రతిభను దశదిశలా చాటాయని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఉత్తరాదిన ఈ సినిమాలు హిందీ చిత్రాలను కూడా పక్కకు నెట్టి అగ్రపథంలో పయనించడం విశేషం! నార్త్ ఇండియాలో హిందీ ‘ట్రిపుల్ ఆర్’ కంటే ‘కేజీఎఫ్- 2’ హిందీ వెర్షన్ ఎక్కువ మొత్తం చూసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అయితే అమెరికాలో మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ను అధిగమించడం అటుంచి, అసలు అందుకోవడానికే ‘కేజీఎఫ్-2’కు సాధ్యం కాదని తెలుస్తోంది.

అమెరికాలో సందడి చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ లో ఇప్పటికీ ‘బాహుబలి-2’ అగ్రస్థానంలో నిలచింది. అక్కడ ఈ చిత్రం 20.5 మిలియన్ల డాలర్లు పోగేసి నంబర్ వన్ స్థానం ఆక్రమించింది. దాని తరువాతి స్థానాన్ని ‘ట్రిపుల్ ఆర్’ 14 మిలియన్ డాలర్లు పోగేసి సొంతం చేసుకుంది. మూడో స్థానంలో ‘బాహుబలి-1’ నిలచింది. ఆ సినిమా మొత్తం 8 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ‘కేజీఎఫ్-2’ ఇప్పటి దాకా 6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అటు హిందీ, ఇటు తెలుగులో భారీ చిత్రాలు వస్తోన్న నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ మహా అయితే మరో 2 మిలియన్ డాలర్లు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా! కావున, అమెరికాలో ‘ట్రిపుల్ ఆర్’ ముందు ‘కేజీఎఫ్-2’ వెనుకబడిందనే చెప్పాలి.

Exit mobile version