Kerala theatre owners to stop screening of Malayalam movies from February 22: థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. అయితే అది మన దగ్గర కాదండోయ్ కేరళలో. అసలు విషయం ఏమంటే ఇక గత కొన్ని సంవత్సరాలుగా OTTలో స్ట్రీమింగ్ చేసే ముందు థియేటర్‌లలో సినిమాలకు కనీస ప్రదర్శన వ్యవధి ఇవ్వాలని థియేటర్ యజమానులు అనేక నిరసనలు చేస్తున్నారు. మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ గ్యాప్ 42 రోజులుగా ఉంది. కానీ కొందరు నిర్మాతలు నిర్ణీత కాలవ్యవధిని నిరంతరం ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ శుక్రవారం నాడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఫిబ్రవరి 22 గురువారం నుండి మలయాళ చిత్రాలను ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
Shannu: దీప్తి సునైనాను గుర్తు చేసిన అభిమాని.. షన్నూ ఊహించని సమాధానం
నిజానికి ఈ విషయంలో కేరళ సినిమా ఓనర్స్ అసోసియేషన్, మలయాళ చిత్ర నిర్మాతల మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్నది సినిమా థియేటర్ యజమానుల డిమాండ్. అయితే కొందరు నిర్మాతలు పదే పదే ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారని థియేటర్ యజమానులు చెబుతున్నారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘మలైకోట్టై వాలిబన్’ సినిమా కొద్ది రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తోంది. పెద్ద హీరో సినిమానే అలా చేయడంతో శుక్రవారం సమావేశం నిర్వహించి ఇకపై మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయం ప్రకటించారు. అయితే ఇలా నిరసనకు దిగడం వారికి ఇది మొదటిసారి కాదు. అయితే అప్పుడు నిర్మాతలతో రాజీకి వచ్చి మళ్ళీ సినిమాలను ప్రదర్శించారు. మరి ఇప్పుడు ఏమి చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
