Site icon NTV Telugu

పోలీస్ స్టేషన్ లో స్టార్ హీరోయిన్ పార్వతి..

parvathy

parvathy

ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు లైంగిక వేధింపుల కేసులో పోలీసులను ఆశ్రయించింది. గతకొన్నిరోజుల నుంచి ఒక వ్యక్తి తనను తరుచు వేధిస్తున్నాడని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష అనే 35 ఏళ్ళ వ్యక్తి తనను రోజు వేధిస్తున్నాడని, డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఫుడ్ పేరుతో నిత్యం ఇంటికి వస్తున్నదని ఫిర్యాదులో తెలిపింది. తాను, తన కుటుంబం ఎంత చెప్పినా అతను వినడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.

https://ntvtelugu.com/rajamouli-thanked-sarkaru-vaari-paata-bheemla-nayak-teams/

పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదురు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇకపోతే పార్వతి మలయా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. హిట్ సినిమాలైనా చార్లీ, టేకాఫ్, బెంగుళూరు డేస్ లాంటి చిత్రాల్లో నటించింది. ఈమె డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ సుపరిచితురాలే. ‘ఉయిరే’ చిత్రంలో యాసిడ్ బాధితురాలిగా ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.

Exit mobile version