నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ కు నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు నందమూరి బాలకృష్ణ. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలైంది.
Also Read : Nani : తమిళ్ డైరెక్టర్ తో నేచురల్ స్టార్ సినిమా ఫిక్స్
ఈ నెల 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ ఊహించిన దానికి మించి వస్తుంది. ఈ సినిమాను చూసి ఇతర భాషల ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కంటెంట్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు అయితే సినిమాని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలోని సీన్లను మలయాళ ప్రేక్షకులు బాగా ట్రోల్ చేసేవారు, కానీ ఇప్పుడు వాళ్లు డాకు మహారాజ్ చూసి ఇటీవల కాలంలో ఇంతటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ సినిమాను ఒకసారి మలయాళంలో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళం లో నేరుగా రిలీజ్ చేసి ఉంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అటు వరల్డ్ వైడ్ గాను డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ అదరగొడుతోంది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్,UAE వంటి దేశాలలో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది.