Site icon NTV Telugu

Keerthy Suresh: స్టార్ హీరోయిన్ బుగ్గలు కొరికేస్తున్న హీరో కొడుకు!

Keerthy Suresh Lip Lock

Keerthy Suresh Lip Lock

Keerthy Suresh shares her Relation with hero Nani family: అదేంటి ఒక స్టార్ హీరోయిన్ బుగ్గల్ని హీరో కొడుకు కొరికేయడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఏదేదో ఊహించుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్. ఇక ఆ హీరో ఇంకెవరో కాదు నాని. నాని కొడుకు అర్జున్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ నాని అనేక సార్లు అర్జున్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు. అయితే కీర్తి సురేష్, నాని కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటి నుంచి వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే నాని కుటుంబంతో కూడా కీర్తి సురేష్ సన్నిహితంగా ఉంటుంది. హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో వీలు కుదిరినప్పుడు నాని కుటుంబాన్ని కలుస్తూ కూడా ఉంటుంది.

Bigg Boss 8 : బిగ్ బాస్ లోకి విష్ణు ప్రియ, రీతూ.. ఇలా లీక్ చేశారేంటి?

ఈ నేపథ్యంలోనే నాని కొడుకు గురించి కీర్తి సురేష్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘ నాని, తన వైఫ్, వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్, వాడు చాలా క్యూట్. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాడు. చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు. ఒకసారి నా బర్త్ డేకి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు, అత్త అని పిలుస్తాడు, వాడు మిస్ యూ, సి యూ అనే పదాలు భలే క్యూట్ గా పలుకుతాడు. మూసీ, సూ యు అంటాడు. నేను ఎప్పుడైనా కాస్త డౌన్ గా ఉన్నప్పుడు వాడి వాయిస్ నోట్ వింటా, ఇది సేవ్ చేసి పెట్టుకున్నా అని అన్నారు. నేను ఇంటికి వెళ్లిన ప్రతిసారి నా బుగ్గ కొరికేంతలా ముద్దు పెడుతుంటాడు, ఆ ఫోటోలు కూడా ఉంటాయని ఆమె అన్నారు. నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటా అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

Exit mobile version