Site icon NTV Telugu

Revolver Rita :ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కీర్తీ సురేష్ మూవీ!

Keerthy Suresh’s Revolver Rita Locks

Keerthy Suresh’s Revolver Rita Locks

స్టార్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తీ సురేష్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేసిన చిత్రాలు, అలాగే ఓటీటీలో విడుదలైన సినిమాలు కూడా ఆమెకు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయాయి.  ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. దర్శకుడు జేకే చంద్రు ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట ఈ చిత్రం ముందే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు.

Also Read : Bhumi Pednekar : మాజీ సీఎం కొడుకుతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమాయణం? రెస్టారెంట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా !

తాజా అప్‌డేట్ ప్రకారం, ‘రివాల్వర్ రీటా’ నవంబర్ 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అదే రోజున ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా విడుదల అవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొననుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. సియన్ రోల్డన్ సంగీతం అందించగా, ఫ్యాషన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్, థ్రిల్, స్టైల్‌ల మేళవింపుగా తెరకెక్కిన ఈ సినిమా కీర్తీ సురేష్ కెరీర్‌కి మళ్లీ కొత్త ఊపునిచ్చేలా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

Exit mobile version