Site icon NTV Telugu

Keerthy Suresh: అతను ఎవరో కనుక్కోవడం మీ వల్ల కాదులే… నేనే చెప్తా

Keerthy Suresh

Keerthy Suresh

దసరా సినిమాతో వంద కోట్ల సినిమాలో నటించిన హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని వెన్నల పాత్రతో ఇచ్చిన కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి… ఒకటి కీర్తి కొత్త ఫోటోలు బయటకి వచ్చాయి, ఇంకో కారణం కీర్తి చేసిన ఒక ట్వీట్. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ అయిన కీర్తి సురేష్, లేటెస్ట్ గా సిల్వర్ కలర్ సారీ, స్లీవ్ లెస్ బోస్ తో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కీర్తి సురేష్ గ్లామర్ క్వీన్ గా కనిపిస్తోంది. ఇక రెండో కారణానికి వస్తే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి అతనితో లవ్ లో ఉంది, ఇతనితో లవ్ లో ఉంది. కీర్తి ఆ హీరోని డేటింగ్ చేస్తుంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ డేటింగ్ రూమర్స్ ఒక హీరోతో కాకపోవడం విశేషం.

రీచ్ కోసం కొందరు ఒక్కోసారి ఒక్కో హీరోతో కీర్తి సురేష్ ని రిలేషన్ లోకి పంపిస్తున్నారు. ఇటీవలే అయితే ఏకంగా ఆల్రెడీ పెళ్లి అయిన ఒక స్టార్ హీరోని కీర్తి మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త స్ప్రెడ్ అవ్వడంతో, కీర్తి సురేష్ వల్ల అమ్మ బయటకి వచ్చి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా ఇలాంటి న్యూస్ ఇంకొకటి స్ప్రెడ్ అవ్వడంతో, ఈసారి స్వయంగా రంగంలోకి దిగిన కీర్తి సురేష్… “ఒక్కసారి కూడా కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు. ఏ పేరు అనిపిస్తే అది రాస్తున్నారు. ఈసారి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే ఆ మిస్టరీ వ్యక్తి పేరుని రివీల్ చేస్తాను. అప్పటివరకూ కాస్త రిలాక్స్ అవ్వండి” అంటూ ట్వీట్ చేసింది. కీర్తి ఫాన్స్ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. మరి ఇక్కడితో అయినా కీర్తి పై వచ్చే రూమర్స్ ఎండ్ అవుతాయేమో చూడాలి.

Exit mobile version