Site icon NTV Telugu

Keerthy Suresh: ఆ రోల్స్ కోసమే బాలీవుడ్‌కి వచ్చాను..

Keerthi Suresh

Keerthi Suresh

కీర్తి సురేశ్‌.. అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ భాషలలో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మహానటి గా తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తన తీరు కాస్త బోల్డ్ రోల్స్‌కి మార్చిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించింది. గతేడాది బేబీ జాన్ సినిమాతో హిందీ తెరపై అడుగుపెట్టిన ఆమె, తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు, లక్ష్యాల గురించి పంచుకుంది.

Also Read : Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్

‘‘ఇది నా కెరీర్‌లో మరో ఉత్తేజకరమైన అధ్యాయం. నన్ను సవాలు చేసే పాత్రలు, కొత్త కథల కోసం బాలీవుడ్‌లోకి వచ్చాను. ఇక్కడి వర్క్‌ కల్చర్‌, విధానం అన్నీ భిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా’’ అని కీర్తి చెప్పింది. నటనను వృత్తిగా ఎంచుకోవడం వెనుక ఉన్న కథను  గుర్తుచేసుకుంటూ..  ‘‘మా నాన్న ముందుగా చదువు పూర్తి చేయాలని నాపై ఒత్తిడి చేశారు. అందుకే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు ఎంచుకున్నా. కానీ నటనపై ఉన్న ప్యాషన్‌ నన్ను చివరకు సినిమాల వైపు నడిపించింది’’ అని వెల్లడించింది. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రివాల్వర్ రీటా, కన్నెవెడి వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. సౌత్‌లో సంపాదించుకున్న క్రేజ్‌ను హిందీ సినిమాలలోనూ కొనసాగిస్తూ, కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే ఆమె లక్ష్యం. సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్న కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ప్రయాణం ఎంత విజయవంతం అవుతుందో సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version