Site icon NTV Telugu

ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తోన్న కీర్తి సురేష్

Keerthy Suresh Turns Businesswoman

Keerthy Suresh Turns Businesswoman

చాలా మంది సినీ సెలెబ్రిటీలు స్టార్ డామ్ పొందగా సైడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. సినిమాలో కావాల్సినంత రెమ్యూనరేషన్ అందుతున్న నచ్చిన దానిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా తమ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ బ్యూటీ భూమిత్ర పేరుతో తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. కుటుంబ మద్దతు కూడా ఉండటంతో కీర్తి ఉత్సహంగా వుంది. విదేశీ భాగస్వాములతో కలిసి కీర్తి ఎంటర్ ప్రెన్యూర్ గా మారుతోంది.

మహానటి సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె డిమాండ్ చేస్తున్నంత పారితోషకం ఇవ్వాల్సి వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలోనూ అదే జరిగింది. ఎన్ని చర్చలు జరిగిన చివరకు ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషనే ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలోను నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version