Site icon NTV Telugu

పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్

Keerthy Suresh hikes remuneration

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆమె కిట్టిలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టులలో నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. భారీగా పారితోషికాన్ని పెంచేసిందని టాక్ నడుస్తోంది.

Read also : ‘ఎఫ్ 3’ షూటింగ్ లో సోనాల్ చౌహాన్

తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం ‘దసరా’ చిత్రానికి కీర్తి సురేష్ 3 కోట్ల రూపాయలు అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ‘దసరా’ సినిమా మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ స్వరకర్త సంతోష్ నారాయణన్ నేపథ్య స్కోర్, సంగీతం అందించబోతున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version