ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితానికి సంబంధించిన విశేషాలను తాను యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటాను అంటూ రాశి కన్నా వెల్లడించింది. ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానల్ లో తన ఇంట్రడక్షన్ సంబంధించిన వీడియోని ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం రాశి ఖన్నా నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Read Also : టీజర్ : ‘మహాన్’ పోరాటం… ప్రామిస్ నిలబెట్టుకోని విక్రమ్
‘మహానటి’ తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా కూడా నటిస్తోంది. మరి ఈ సినిమాలైనా ఆమెకు మంచి హిట్స్ ఇస్తాయేమో చూడాల్సి ఉంది.