NTV Telugu Site icon

Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్‏లో మహానటి.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్

Keerthi Suresh

Keerthi Suresh

Keerthy Suresh: కేజీఎఫ్ సినిమాల తరువాత చిత్ర పరిశ్రమలో హోంబోలే ఫిల్మ్స్‌ పేరు మారు మోగుతోంది. దక్షిణాది భాషల్లో చిత్ర నిర్మాణం చేపడుతామని అధికారికంగా ప్రకటించిన ఆర్‌ సంస్థ అధినేత విజయ్‌ కిరగందర్‌ ఇప్పటికే టాలీవుడ్‌లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న సలార్‌ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సంస్థ కోలీవుడ్‌లోనూ చిత్రాలు చేయడానికి సిద్ధమవుతోంది.

Read Also: Rashmika : మహేష్ సినిమాలో రష్మిక.. ఒక్క సాంగ్‎కే అన్ని కోట్లా !

ఇదిలా ఉండగా మహానటి కీర్తి సురేశ్ ఎన్నో సంచలనాలు నమోదు చేసిన కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. సరరై పోట్రు చిత్రం ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. ‘ఇందులో శింబు కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం. తాజాగా ఈ సంస్థలో నటి కీర్తి సురేష్‌ కథానాయికగా నటించబోతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం అని సమాచారం. నేడు సినిమాను అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీనికి దర్శకుడు ఎవరు..? తదితర వివరాలు ఇంకా వెలువడ లేదు. కాగా ప్రస్తుతం నటి కీర్తి సురేష్‌ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్‌ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మరోపక్క కీర్తి సురేష్‌ నటనకు గుడ్‌ బై చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Show comments