Site icon NTV Telugu

Keerthi Bhat: డబ్బు కోసమే వదిలేసిందా? కీర్తి భట్‌ బ్రేకప్’పై ఎక్స్ లవర్ సంచలన వీడియో!

Keerthi Bhat Vijay Karthik

Keerthi Bhat Vijay Karthik

బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సీరియల్ నటి కీర్తి భట్, తాను రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న నటుడు విజయ్ కార్తీక్‌తో పెళ్లి విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించింది. ఇకమీదట స్నేహితులు లాగా ఉండాలని భావిస్తూ, ఇద్దరం మ్యూచువల్ గా విడిపోతున్నామని నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ఈ విషయం మీద తాజాగా విజయ్ కార్తీక్ స్పందించాడు.

Also Read:Fauji: దసరాకి ‘ఫౌజీ’ గ్రాండ్ రిలీజ్

తాను ఈ విషయం మీద స్పందించాలి అని అనుకోలేదు కానీ, చాలా మంది ఆమెను వదిలివేయవద్దు అంటూ తనకు ఫోన్లు, మెసేజ్ల ద్వారా చెబుతున్నారని, ఈ విషయంలో తాను ఆమెను వదిలేయాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. “కీర్తి గారిని వదిలేయకండి, కూర్చుని మాట్లాడుకోండి అని చాలా మంది కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు.

వదిలేయడం అనేది నా డెసిషన్ కాదు, ఎందుకంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చితార్థం చేసుకున్నాను. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని మా కుటుంబ సభ్యులు కూడా భావించారు. అలాంటప్పుడు నేనెందుకు విడిపోవాలని డెసిషన్ తీసుకుంటాను? ఇది ఆమె సొంత డెసిషన్. ఎందుకంటే నేను ఇంకా ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాలేదని ఆమెకు స్ట్రాంగ్ గా అనిపించింది. ఇదే విషయం డిసెంబర్‌లోనే చెప్పి ఆమె ఇప్పటికే తన జీవితం కొత్తగా ప్రారంభించింది. ఆమెకు ఆమె జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది, నేను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను” అంటూ విజయ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version