Site icon NTV Telugu

Keedaa Cola: అప్డేట్ ఇస్తున్నాం తీసుకోవాలే…

Keedaa Cola

Keedaa Cola

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అసలు ఎవరు ఊహించని హిట్ కొట్టింది, మోడరన్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ యూత్ కి చాలా ఇష్టం. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ని హోల్డ్ చేసి ‘కీడా కోలా’ అనే సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు. తాగుదాం, గోవా పోదాం అనే సింగల్ వర్డ్స్ ని ఈ నగరానికి ఏమైంది సినిమాలో వాడిన తరుణ్ భాస్కర్ ఈసారి కీడా కోలా సినిమాలో ‘సీన్ అయితది’ అనే పదాన్ని వాడినట్లు ఉన్నాడు.

Read Also: Tharun Bhascker : మళ్లీ మెగాఫోన్ పట్టిన తరుణ్ భాస్కర్.. ఈసారి ఏ ట్రెండ్ క్రియేట్ చేస్తాడో?

అందరూ కొత్తవాళ్లే నటించబోతున్న ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. అప్డేట్ ఇస్తున్నాము తీసుకోవాలి అంటూ షూటింగ్ సెట్స్ నుంచి ఒక ఫన్నీ వీడియో బయటకి వదిలాడు. సెట్స్ లో కీడా కోలా షూటింగ్ ని ఎంత సరదాగా చేశారో చూపిస్తూ బయటకి వచ్చిన ఈ వీడియో ఎండ్ లో ఫిబ్రవరి 1న కీడా కోలా మూవీకి సంబంధించిన ‘అప్డేట్ ఇస్తున్నాం, తీసుకోవాలే’ అని చెప్పేశాడు తరుణ్ భాస్కర్. మరి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీతో తరుణ్ భాస్కర్ ఆడియన్స్ ని ఎంత ఎంటర్టైన్ చేస్తాడో, ఫిబ్రవరి 1న కీడా కోలా నుంచి ఏ అప్డేట్ రిలీజ్ కానుందో తెలియాలి అంటే వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version