Site icon NTV Telugu

Tharun Bhascker: సెకండ్ షెడ్యూల్ లో ‘కీడా కోలా’!

Keeda Cola (1)

Keeda Cola (1)

Keedaa Cola : యంగ్ అండ్ ట్యాలెంటడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది” చిత్రాలు రెండూ చక్కని విజయాన్ని సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తయింది. డిసెంబర్ 3న రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్.
శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేస్తామంటున్నారు నిర్మాతలు.

Exit mobile version