NTV Telugu Site icon

Kavya Thapar: కావ్య భలే సైలెంటుగా కానిచ్చేస్తుందే!

Kavyathapar Cover

Kavyathapar Cover

Kavya Thapar Signing Back to Back Movies: “ఏక్ మినీ కథ” ఆ తరువాత “బిచ్చగాడు 2” సినిమాలు చేసిన నటి కావ్య థాపర్ అనుకోకుండా టాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి ఈ భామ “ఏక్ మినీ కథ” సినిమాలో మెరిసినప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. “బిచ్చగాడు 2” సినిమా అనుకున్నంత బాగా రాలేదు, దీంతో ఆమె కనుమరుగు అయిపోతుందేమో అన్న అంచనాల నేపథ్యంలో ఆమె అనూహ్యంగా బిజీ అయింది. అసలు విషయం ఏమిటంటే ఆమె ఈ మధ్య ఆమె ఇటీవల అనేక సినిమా ఒప్పందాలపై సంతకం చేసింది. అవన్నీ 2024 ప్రథమార్థంలో థియేటర్లలో విడుదల కానున్నాయి. కావ్య థాపర్ రవితేజ భార్యగా నటించిన “ఈగిల్” జనవరి 13, 2024న థియేటర్లలో విడుదల కానుంది.

Raghava Reddy : ఆకట్టుకుంటోన్న ‘రాఘవ రెడ్డి’ ట్రైలర్

ఇది ఆమె మొదటి భారీ బడ్జెట్ మూవీ. ఇక ఆమె తదుపరి సినిమా పూరి జగన్నాధ్ “డబుల్ ఇస్మార్ట్”. ఈ సినిమాలో ఆమె రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించనుంది. “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. షూట్ కూడా శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా మార్చి 2024లో విడుదల కానుంది. ఇక మరో పక్క ఆమె ఇటీవలే గోపీచంద్ నటించిన దర్శకుడు శ్రీను వైట్ల సినిమాకి కూడా సంతకం చేసింది. అసలు ఏమాత్రం టాలీవుడ్ లో ఉందా? లేదా? అని అనుమానం కలిగించేలా ఉన్న ఆమె ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్లడం గమనార్హం.

Show comments