Site icon NTV Telugu

కత్రినా- విక్కీల పెళ్లి వీడియో రూ.100 కోట్లు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

katrina

katrina

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కు కౌశల్ ల వివాహానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ జంట ఇప్పటివరకు తమ పెళ్లిపై మీడియా ముందుకు వచ్చింది లేదు.. అధికారికంగా ప్రకటించింది లేదు. అయినా పెళ్లి వేడుకలు మాత్రం జామ్ జామ్ అని జరిగిపోతున్నాయి అంటూ వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రాజస్థాన్ లోని ఒక చిన్న టౌన్ లో అత్యాదునిక హంగులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ వేడుక ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట పెళ్లి గురించి తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. కత్రినా – విక్కీల పెళ్లి వేడుక వీడియో ఫుటేజ్ కోసం ఒక ప్రముఖ ఓటిటీ సంస్ట భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందంట.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 100 కోట్లు ఆ వెడ్డింగ్ ఫుటేజ్ కోసం క్యాట్- విక్కీలకు ముట్టజెప్పారంట.. ఆ స్ట్రీమింగ్ హక్కులు తీసుకొని పెళ్లి తరువాత వారి వీడియోను కేవలం వారి ఓటిటీలో విడుదల చేయనున్నారట.. అంతేకాదు పెళ్లి మొదటి రోజు నుంచి ముగింపు వారకు వారే దగ్గర ఉండి ఆ వేడుకను క్యాప్చర్ చేయనున్నారట.. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. నిజమైతే మాత్రం పెళ్లి ద్వారా కూడా సంపాదిస్తున్న జంటల్లో క్యాట్- విక్కీ కూడా చేరిపోయారు అనే చెప్పాలి. మరి కనీసం రేపు పెళ్ళిరోజైన ఈ జంట అధికారికంగా మీడియా ముందుకు వచ్చి మేము పెళ్లిచేసుకున్నాం అని చెప్తారో లేదో చూడాలి.

Exit mobile version