Site icon NTV Telugu

Katrina Kaif : ‘మెరీ క్రిస్మస్‌’తో ఆ కోరిక తీరింది..

Whatsapp Image 2023 12 25 At 9.09.43 Am

Whatsapp Image 2023 12 25 At 9.09.43 Am

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ చిత్రంలో జోయాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అందరినీ అలరించిందిటవల్ ఫైట్ సహా పలు యాక్షన్ సన్నివేశాల్లో కళ్లు చెదిరిపోయేలా కత్రినా నటించింది. ఇక ఆమె తాజాగా నటించిన చిత్రం ‘మెరీ క్రిస్మస్’. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో కూడా ఆమె మెస్మరైజింగ్ సాహసాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్ ట్రిప్స్ కూడా వేస్తోందట.‘మెరీ క్రిస్మస్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా, ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2024 జనవరి 12న విడుదల కాబోతున్న మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు వెల్లడించిన ఆమె కొన్ని సీక్రెట్స్ చెప్పింది.. సినిమాపై మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మోటార్ సైకిల్ రైడింగ్ నిర్వహించడం గురించి కూడా స్పందించింది. గతంలో తనకు బైక్ నడపడం వచ్చేది కాదని కత్రినా వెల్లడించింది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ మూవీ షూటింగ్ సమయంలో నేర్చుకున్నట్లు ఆమె తెలిపింది.

ఆ మూవీ షూటింగ్ సమయంలో అర్థరాత్రి తర్వాత బైక్ తీసుకుని రోడ్ల మీదికి వచ్చేదాన్నని కత్రినా చెప్పింది. మొదట్లో బైక్ నేర్చుకునే టిప్స్ నేర్చుకునేందుకు స్పెయిల్ లో ట్రైనింగ్ స్కూల్ కు వెళ్లినట్లు కూడా ఆమె వెల్లడించింది.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి నుంచి యష్ రాజ్ స్టూడియోస్ వరకు రైడింగ్ చేసినట్లు వివరించింది. “రాత్రి సమయంలో ట్రాఫిక్ కారణంగా బైక్ సరిగ్గా నడపడం వచ్చేది కాదు. కానీ, కొద్ది రోజుల పాటు అలాగే ఎంతో ట్రై చేశాను. ఆ తర్వాత బైక్ నడపడం వచ్చింది. నేను బైక్ నేర్చుకునే సమయంలో నాతో పాటు ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు ఎవరు అనేది మాత్రం నేను బయటకు చెప్పను” అని తెలిపింది.ఇక వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే తన కోరిక ‘మెరీ క్రిస్మస్’ సినిమాతో నెరవేరిందని కత్రినా తెలిపింది. డైరెక్టర్ శ్రీ రామ్ రాఘవన్ తో కూడా సినిమా చేయాలనే కోరిక కూడా తీరిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించడం అద్భుతం అనిపించిందని వివరించింది. ఆయన నటనలో ఎన్నో కోణాలు ఉన్నాయని వెల్లడించింది.

Exit mobile version