Site icon NTV Telugu

వీడియో: కత్రినా హార్డ్ వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినమైన వ్యాయామాలను చేస్తుంటోంది. కొన్ని వ్యాయామాలు చేయాలంటే గట్స్ ఉండాలి. కానీ, కత్రినా విషయంలో ఆలా కాదు, చాలా కమిట్మెంట్ తో క్లిష్టమైన కఠోర వ్యాయామాలనే ఆమె ఇష్టపడుతుంది. ఎంత బిజీగా వున్నా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంది. తాజాగా కత్రినా జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ‘నా మనసుకు క్రమం తప్పకుండా క్రమశిక్షణలో పెడుతుంటాడు. దాన్ని నా శరీరం ఫాలో అవుతుంది’ అంటూ కత్రినా క్యాప్షన్‌ను జోడించింది. కత్రినా హార్డ్ వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తనదైన నటనా, ఫిట్నెస్ తో కత్రినా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. సినీ పరిశ్రమలో భాగమైనప్పటి నుండి ఫిజికల్ గా తన అందాన్ని శరీరాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Exit mobile version