‘కాశ్మీర్ ఫైల్స్’ ఈ ఏడాది ఘన విజయం సాధించిన సినిమాల్లో ఒకటి. విమర్శకుల ప్రశంసలను గెలుచుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిందీ సినిమా. ఇప్పుడు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరోసారి చేయికలిపారు. అయితే ఈసారి కూడా భారతదేశపు మూలాల్లో ఉన్న అతి గొప్ప కథలను వారు సినిమాలుగా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు వినాయక చవితి శుభ సందర్భంగా ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అభిషేర్ తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమక్షంలో ఇరు నిర్మాణ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ ‘గొప్ప కథలు చెప్పాలనే తపన కొనసాగుతుంది.
పవిత్రమైన వినాయకచవితి రోజున తదుపరి సినిమాల కోసం @iambudda,@vivekagnihotri , #PallaviJoshi తో కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. #TKFteamisBack అని ట్వీట్ చేశారు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత అభిషేక్ అగర్వాల్ ‘కార్తికేయ 2’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దాదాపు రూ.30 కోట్ల వసూళ్లు సాధించటం విశేషం.
