NTV Telugu Site icon

Kashmir Files: అదో వల్గర్, ప్రాపగాండా సినిమా ‘ఇఫ్ఫీ’ జ్యూరీ సంచలన వ్యాఖలు…

Kashmir Files

Kashmir Files

కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, హేట్ ప్రాపగాండాని సృష్టిస్తున్నారని మరి కొందరు అన్నారు. పండిట్స్ ని జరిగింది ప్రపంచానికి తెలిసేలా చేశారని హిందుత్వ వాదులు అంటున్న మాట. ఈ సపోర్ట్ చేస్తున్న మరియు వ్యతిరేకిస్తున్న వాళ్ల మాటలని పక్కన పెడితే, 15 కోట్లతో తెరకెక్కిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 340 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ మానిపోయిన గాయాన్ని మళ్లీ గుర్తు చేసింది.

‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకి రాజకీయ రంగు కూడా అంటుకుంది కాబట్టి రాజకీయంగా ఒక పార్టీని వ్యతిరేకించే వాళ్లు ఈ సినిమాని కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేక వర్గాల విమర్శలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వార్తల్లో ఉంది. తాజాగా మరోసారి ‘కాశ్మీర్ ఫైల్స్’ హాట్ టాపిక్ అయ్యింది. గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నాదవ్ లిపిద్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండాల్సిన సినిమా కాదు, ఆర్టిస్టిక్ కేటగిరిలో అలాంటి సినిమా చూసి షాక్ అయ్యాం. ఈ మాటని బహిరంగంగా చెప్పడానికి ఎలాంటి సంకోచం” లేదంటూ మాట్లాడాడు. ఇజ్రాయిల్ స్క్రీన్ రైటర్ అయిన ‘నాదవ్’ ఎంతోమంది ఇండియన్ మినిస్టర్స్, సినీ సెలబ్రిటీస్ ముందు ‘కాశ్మీర్ ఫైల్స్’ గురించి ఇలా మాట్లాడడం ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇంకా స్పందించలేదు కానీ కాశ్మీర్ ఫైల్స్ లో నటించిన అనుపమ్ ఖేర్ మాత్రం “అబద్దం ఎంత పెద్దగా ఉన్నా, నిజం ముందు అది చాలా చిన్నగానే ఉంటుందని” ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న ‘నాదవ్’ మాటలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.