Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వచ్చిన తాజా మాస్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు‘. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి వీకెండ్ లో రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ తర్వాత వచ్చే మొదటి సోమవారం టెస్ట్‌లో ‘కరుప్పు’ చిత్రం అద్భుతమైన వసూళ్లతో డిస్టింక్షన్ మార్కులతో పాసైంది. తమిళనాడులో ఈ చిత్రం సోమవారం నాడు కూడా డబుల్ డిజిట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
కేవలం తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మరియు కేరళలలో ‘కరుప్పు’ బాక్సాఫీస్ రన్ అద్భుతంగా సాగుతోంది. తెలుగు స్టేట్స్ లో నాలుగు రోజులకు గాను రూ. 15.50 కోట్ల గ్రాస్ రాబట్టగా రూ. 7.94 షేర్ వసూలు చేసింది. అటు కర్ణాటకలో ఫస్ట్ వీకెండ్ నాటికి రూ. 9.91 కోట్ల గ్రాస్ రాబట్టగా సోమవారం రూ. 1.67 కోట్లు రాబట్టి మొత్తంగా రూ. 11.58 కోట్ల గ్రాస్ తో సూపర్ హిట్ గా నిలిచింది. వర్కింగ్ డేస్ లో కూడా వస్తున్న ఈ సాలిడ్ హోల్డ్ చూస్తుంటే ‘కరుప్పు’ చిత్రం తన ఫుల్ రన్లో చాలా ఈజీగా రూ. 250 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్య నటన, కమర్షియల్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్య ఫ్యాన్స్‌కు ఇది పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ బ్లాక్‌బస్టర్ అని చెప్పొచ్చు.
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!