ఒక సినిమా అంటే అందులో అని ఉంటాయి. ముఖ్యంగా రోమాంటిక్ సీన్స్ కి ఈ మధ్య చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు లేకపోతే అభిమానులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇలాంటి సీన్ షూటింగ్ జరిగేటప్పుడు, కొన్ని సన్నివేశాలు చేయలేక ప్రాజెక్టు నుంచి తప్పకుండా వారు ఉన్నారు.. అలాగే సింగిల్ టేక్ లో ఇలాంటి సన్నివేశాలు క్లోజ్ చేసిన డైరెక్టర్ నటీనటులు, హీరోయిన్స్, హీరోలు కూడా ఉన్నారు. కానీ ఒక హీరో మాత్రం ముద్దు సీన్ కోసం 37 టేకులు తీసుకున్నాడట.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. అతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని, ఫ్యామిలీ నుంచి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ‘భూల్ భులయ్యా 3’ సినిమాతో భారీ విజయం సాధించిన కార్తీక్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఓ ముద్దు సీన్ గురించి తెలిపాడు.
కార్తీక్ మాట్లాడుతూ.. ‘ ‘కాంచి’ అనే మూవీలో నేను హీరోయిన్ మిస్తి లవర్స్ గా నటించాం. ఇందులో మిస్తి నేను ముద్దు పెట్టుకునే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్ ఎన్నిసార్లు చేసినా డైరెక్టర్ సంతృప్తి చెందలేదు. కట్ చెప్పినా మళ్లీ ముద్దు పెట్టుకోమన్నారు అలా మొత్తం మాతో 37 టేకులు తీసిన తర్వాత ఓకే చెప్పారు. ఇలా చేయడంలో తప్పులేదు కానీ మిస్తీ ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటుందో అని భయపడిపోయాను. అయినప్పటికీ ఆమె డైరెక్టర్ చెప్పినట్లు చేసింది. కానీ ఒకానొక దశలో నాకు చిరాకు వేసింది.. ముద్దు ఎలా పెట్టుకోవాలి మీరే చేసి చూపించండి సార్ అని డైరెక్టర్ పై అరిచేశా. ఈ సినిమా 2014లో విడుదల అయింది. ప్రేక్షకులను కూడా మెప్పించింది’ అని తెలిపాడు. ప్రజంట్ హీరో మాటలు వైరల్ అవుతున్నాయి.