NTV Telugu Site icon

Karthi: ‘సర్దార్’ గారు అప్పుడే ఓటిటీలోకి వచ్చేశారా..?

Sardar

Sardar

Karthi:విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ మీద హిట్లు అందుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గత రెండు నెలల్లో కార్తీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఈ రెండు సినిమాలో పర్వాలేదు అనిపించాయి కానీ తమిళ్ లో మాత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరినవే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ ఒకటి కాగా.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ ఒకటి. ఇక ముఖ్యంగా సర్దార్ గురించి చెప్పుకోవాలంటే వాటర్ మాఫియా గురించి ఒక స్పై చేసిన పోరాటమే సర్దార్. తండ్రి కొడుకులుగా ద్విపాత్రభినయం చేసి కార్తీ ఆకట్టుకున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకున్నది కానీ కలక్షన్లను రాబట్టలేకపోయింది.

ఇక పోతే ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా వచ్చి కనీసం మూడు వారాలు కూడా దాటకముందే ఈ సినిమా ఓటిటీలోకి రావడంతో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతున్నారు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా అయితే త్వరగా వచ్చినా ఓకే.. కానీ సర్దార్ తెలుగులో ఎక్కువ టాక్ రాకపోయినా తమిళ్ లో బాగానే లాకొచ్చింది. మరి అప్పుడే ఓటిటీ ఎందుకు అంటున్నారు. కాగా, సర్దార్ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. భారీ ధరను చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆహాలో నవంబర్ 18నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా థియేటర్ లో రాబట్టలేని విజయాన్ని ఓటిటీలోనైనా అందుకుంటుందేమో చూడాలి.