Site icon NTV Telugu

Karthi : ఊహించని దర్శకుడితో కార్తీ సినిమా

Karthi

Karthi

తమిళ యంగ్ హీరో కార్తీ డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది.

Also Read : Raj Tarun Case : లావణ్య డ్రామా కంపెనీ.. ప్రతి రోజు నాలుగు ఆటలు

ప్రస్తుతం సర్దార్ కు సీక్వేల్ సర్దార్ 2 తో పాటు మరో సూపర్ హిట్ ఖైదీ కి సీక్వెల్ ఖైది 2లో నటిస్తున్నాడు కార్తీ. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో దర్శకులను రిపీట్ చేయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా లేటెస్ట్ ఈ యంగ్ ఓ సీనియర్ దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసాడని టాక్ వినిపిస్తోంది. దెయ్యాల కథలతో సినిమాలు హిట్ కొట్టడంలో తమిళ డైరెక్టర్ సుందర్ సి కు ప్రత్యేక గుర్తింపు ఉంది. లేటెస్ట్ గా అరుణ్ మానై తో సూపర్ హిట్ కొట్టాడు సుందర్ సి. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు కార్తీ కోసం ఓ కథ రెడీ చేసాడట. ఆ కథను కార్తీకి వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట కార్తీ. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రిన్స్ పిచర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కేవలం మూడు నెలల్లో ఈ సినిమాను ఫినిష్ చేసేలా ప్లాన్ చేసాడట దర్శకుడు సుందర్ సి.

Exit mobile version