Site icon NTV Telugu

Karthikeya2: ‘కృష్ణ ఈజ్ ట్రూత్’ అంటున్న అనుపమ్ ఖేర్!

Krishna Sruthi

Krishna Sruthi

Karthikeya2 : Anupam Kher says ‘Krishna is truth’!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ‘కార్తికేయ-2’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆయన తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయనే తెలియచేస్తూ, సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా మూవీలోని ప్రధాన సన్నివేశాలు చూసిన తర్వాత దీనికో హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలని అనిపించిందని అన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కు, హీరో నిఖిల్ కు అనుపమ్ ఖేర్ తెలిపారు. కృష్ణుడి గాథకు సంబంధించిన అంశాలతో ‘కార్తికేయ-2’ సినిమా తెరకెక్కిందని, అందుకే ‘కృష్ణ ఈజ్ ట్రూత్’ అనేది హ్యాష్ ట్యాగ్ గా ఈ మూవీకి పెడితే బాగుంటుందని అనుపమ్ ఖేర్ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను ఆయన అభిషేక్ అగర్వాల్, నిఖిల్ కు అందించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాష్లలో ‘కార్తికేయ-2’ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఈ మధ్య కాలంలో అనుపమ్ ఖేర్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ‘కార్తికేయ-2’ను టి. జి. విశ్వప్రసాద్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

వివరణ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్

‘కార్తికేయ -2’ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇటీవల జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో అనుపమ కనిపించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. అయితే వాటికి అనుపమా పరమేశ్వరన్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తాను రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నానని, ఈ డేట్స్ వారికి కేటాయిండంతో ‘కార్తికేయ-2’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నానని, అంతకు మించి వేరే ఏ కారణం లేదని స్పష్టం చేసింది. ఈ సినిమా రిలీజ్ అనేక సార్లు వాయిదా పడటంతో అనుపమా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రమోషన్స్ కు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఎదురయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి రూపొందించారని, ముఖ్యంగా నిఖిల్ కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని అనుపమా చెబుతూ, ఈ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపింది.+

 

 

Exit mobile version