NTV Telugu Site icon

Salaar Child Artist: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది రవితేజ కొడుకా.. అసలు విషయం ఇదే!

Karthikeya Dev Raviteja

Karthikeya Dev Raviteja

Karthikeya Dev Reveals his Relation with Raviteja: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. ఈ రోజు సోమవారం అయినా సరే క్రిస్టమస్ సెలవు కలిసి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక సలార్ సినిమా చూసిన తర్వాత సలార్ సినిమాలో నటించిన వారి గురించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు నెటిజనులు.. అందులో భాగంగా సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ చిన్నప్పటి పాత్రలో నటించిన కార్తికేయ దేవ్ అనే కుర్రాడి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కార్తికేయ రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని నటన మీద ఆసక్తితో ఆడిషన్స్ చేసి సలార్ అవకాశం దక్కించుకున్నాడని ప్రచారం జరిగింది. కొందరైతే ఒక అడుగు ముందుకేసి రవితేజ కొడుకే కార్తికేయ దేవ్ అన్నట్టుగా వార్తలు వండి వడ్డించారు.

Dunki vs Salaar: డంకీ vs సలార్.. గెలుపెవరిదో తెలుసా?

అయితే తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కార్తికేయ ఈ విషయం మీద స్పందించాడు. తనకు హీరో రవితేజకు బంధుత్వం ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందో ఎందుకు మొదలైందో కూడా తెలియదని, తాను రవితేజ గారి పేరు ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదని ఆయన చెప్పుకొచ్చాడు. తాను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నానని నటన మీద ఆసక్తితో కాస్టింగ్ డైరెక్టర్ల ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అలా మొత్తం 160 మందిని ఆడిషన్ చేస్తే సలార్లో తాను ఒక్కడిని మాత్రం ప్రశాంత్ నీల్ కి నచ్చానని అలా ఈ అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక సలార్లో నటన చూసి ప్రశాంత్ నీల్ తనను పృథ్వీరాజ్ సుకుమారన్ కే రికమెండ్ చేయడంతో ఆయన లూసిఫర్ 2 సినిమాలో కూడా తనకు చిన్నప్పటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. అది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Show comments