Karthikeya 2: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లు రాబట్టుకొంటుంది. హిందీలో సైతం ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు రెండు నెలల తరువాత ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ఓటిటీలో రిలీజ్ కానుంది.
కార్తికేయ 2 డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇక తాజాగా జీ 5 కార్తికేయ2 స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. దీంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిఖిల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక నిఖిల్ కెరీర్ విషయానికొస్తే.. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం నిఖిల్ 18 పేజిస్, స్పై సినిమాల్లో నటిస్తున్నాడు. స్పై నిఖిల్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలతో నిఖిల్ తన విజయ పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.
