Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. అందరూ గర్వపడేలా ఒక చిన్న సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ చేశాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. ఇటు సౌత్ లోనే కాకుండ నార్త్ లోనూ కార్తికేయ తన సత్తా చాటింది. 10 రోజుల్లో వంద కోట్ల కల్బ లో జాయిన్ అయ్యి రికార్డు సృష్టించింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ 10 రోజుల్లోనే ఈ రికార్డును అందుకోవడం విశేషం.
నిఖిల్ ఎట్టకేలకు ఈ మార్క్ ను బద్దలుకొట్టాడు. ఇక ఈ సక్సెస్ ను అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది, 100 కోట్ల సక్సెస్ ను కర్నూల్ లో ఆగస్టు 26 న జరుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందు మొండేటి- నిఖిల్ కాంబోలో వచ్చిన కార్తికేయ ఎంత ఘనవిజయం సాధించిందో.. అంతకు మించి దానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కూడా అంతకు మించి విజయాన్ని అందుకోవడం చాలా విశేషమని చెప్పాలి. ఏదిఏమైనా ఈ సినిమాతో నిఖిల్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ చేరింది. ఇక ఈ సినిమా తరువాత నిఖిల్ రేంజ్ మారిపోతోంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి ముందు ముందు నిఖిల్ ఈ రేంజ్ ను ఎలా కాపాడుకొంటాడో చూడాలి.
